పుష్ప-2 అప్డేట్ గురించి మీకు తెలుసా..?
PushpaTheRule Pooja Ceremony tomorrow. బాహుబలి-2, కేజీఎఫ్-2, కార్తికేయ-2.. ఇలా దక్షిణాది సీక్వెల్స్ దేశ వ్యాప్తంగా భారీ హిట్స్
By Medi Samrat Published on 21 Aug 2022 3:15 PMబాహుబలి-2, కేజీఎఫ్-2, కార్తికేయ-2.. ఇలా దక్షిణాది సీక్వెల్స్ దేశ వ్యాప్తంగా భారీ హిట్స్ ను అందుకుంటూ ఉన్నాయి. ఇక సినిమా అభిమానులందరూ ఎదురుచూస్తున్న మరో సీక్వెల్ ఏమిటంటే పుష్ప-2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మొదటి భాగం భారీ హిట్ ను అందుకుంది. తెలుగు ఆడియన్స్ కంటే.. బాలీవుడ్ జనాలే పుష్ప మొదటి భాగాన్ని ఆదరించారనడంలో తప్పు లేదు. ఇక పుష్ప-2 విషయంలో కాస్టింగ్ పరంగానూ, బడ్జెట్ పరంగానూ తగ్గేదేలే అంటోంది చిత్ర యూనిట్. పుష్ప-2 ఇంకా భారీగా ఉండబోతోందని తెలుస్తోంది. ఇక పుష్ప-2 షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
#PushpaRaj is back!
— Mythri Movie Makers (@MythriOfficial) August 21, 2022
This time to Rule 😎#PushpaTheRule Pooja Ceremony tomorrow💥
India's most anticipated sequel is going to be BIGGER ❤️🔥
Icon Star @alluarjun @iamRashmika @ThisIsDSP @aryasukku pic.twitter.com/791FhTOlC5
'పుష్ప 2' సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలను లాంచనంగా నిర్వహించబోతున్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన వచ్చింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. 'పుష్ప: ద రూల్' అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప-2 లో పుష్ప రాజ్ కు.. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ కు మధ్య వచ్చే సీన్స్ అద్భుతంగా ఉండబోతున్నాయని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమా మీద భారీ అంచనాలకు తగ్గట్టే సినిమాను కూడా భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారు.