'పుష్ప' రిలీజ్ డేట్ చెప్పిన అల్లు అర్జున్.. ఎప్పుడంటే..?

Pushpa Movie Release Date Announced. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప రిలీజ్ డేట్.

By Medi Samrat  Published on  28 Jan 2021 7:07 AM GMT
Pushpa Movie Release Date Announced

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య-2 వంటి సూప‌ర్ హిట్ సినిమాల తర్వాత సుకుమార్‌, బన్నీ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఐదు భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. హీరో అల్లు అర్జున్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో విడుద‌ల తేదీని తెలియ‌జేశాడు. బ‌న్నీ స్మ‌గ్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న‌ ఈ సినిమా ఆగస్టు 13న థియేటర్లలో వేట మొదలు పెట్టనున్నాడు.ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సినిమా సాగుతుంది. ఈ సినిమాలో బ‌న్నీ స‌ర‌స‌న‌ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమాలో హీరోహీరోయిన్లు చిత్తూరు యాసలో డైలాగ్స్‌ చెబుతారని తెలుస్తోంది. హీరో కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎలా మారాడన్నదే కథాంశంతో.. బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుందట‌. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేష‌న్‌ దేవిశ్రీ ప్రసాద్ స్వరాల‌ను స‌మ‌కూర్చుతున్నాడు. హిట్ చిత్రాల నిర్మాణ సంస్థ‌ మైత్రీ మూవీస్ బ్యాన‌ర్‌పై.. నిర్మాత‌లు నవీన్‌ ఎర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Next Story