రెండో వారంలో కూడా రికార్డులే పుష్ప రాజూ !!

పుష్ప-2 కలెక్షన్ల వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం నుండి హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉన్నాయి.

By Kalasani Durgapraveen  Published on  15 Dec 2024 6:15 PM IST
రెండో వారంలో కూడా రికార్డులే పుష్ప రాజూ !!

పుష్ప-2 కలెక్షన్ల వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం సాయంత్రం నుండి హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ ఉన్నాయి. ఇక హిందీ వెర్షన్‌లో ఈ సినిమా శనివారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో రూ.46.50 కోట్లు వసూలు చేసింది. హిందీ వెర్షన్‌లో కేవలం 10 రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్‌లో పుష్ప-2 అడుగుపెట్టింది. జవాన్, స్త్రీ2, గదర్2, పఠాన్, బాహుబలి2, యానిమల్ సినిమాలను అధిగమించి అత్యంత వేగంగా పుష్ప-2 ఈ రికార్డు నెలకొల్పింది.శుక్రవారం రూ.27.50 కోట్లు, శనివారం ఏకంగా రూ.46.50 కోట్లతో కలుపుకొని మొత్తం రూ.507.50 కోట్లు వసూలు చేసింది.

బాలీవుడ్‌లో రెండవ శనివారం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కూడా పుష్ప-2 నిలిచింది. గతంలో స్త్రీ 2 సినిమా రూ. 33.80 కోట్లు, గదర్2 రూ. 31.07 కోట్లు, జవాన్ రూ. 31.07 కోట్లు, జవాన్ 30.10 కోట్లు, బాహుబలి-2 రూ.26.50 కోట్లు, ది కశ్మీర్ ఫైల్స్ రూ.24.80 కోట్లు, దంగల్ రూ.23.07 కోట్లు, పఠాన్ రూ.22.50 కోట్లు వసూలు చేశాయి. ఆ రికార్డులన్నీ పుష్ప రాజు ఇప్పుడు కొట్టేశాడు.

Next Story