గాడ్ ఫాదర్ లో 'పూరీ జగన్నాథ్' కూడా..

Puri Jagannadh to play a special role in Godfather. నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.

By Medi Samrat  Published on  9 April 2022 2:15 PM GMT
గాడ్ ఫాదర్ లో పూరీ జగన్నాథ్ కూడా..

"నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు. ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే introducing my @purijagan in a special role,from the sets of #Godfather" అంటూ మెగా స్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ ఈరోజు వైరల్ అయింది.

చిరంజీవి రాబోయే చిత్రం 'గాడ్‌ఫాదర్' చిత్రంలోకి రోజు రోజుకీ స్టార్స్ వచ్చి చేరుతూ ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ నటిస్తూ ఉండగా.. లైగర్‌ దర్శకుడు పూరీ జగన్నాధ్‌ తాజాగా గాడ్‌ఫాదర్‌లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న చిరంజీవి, పూరీని స్వాగతించారు. గాడ్ ఫాదర్ సెట్స్‌లో చిరంజీవి పూరీకి పూల బొకే కూడా ఇచ్చారు.

గాడ్ ఫాదర్ థని ఒరువన్ ఫేమ్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్. ఈ చిత్రంలో చిరంజీవి, సల్మాన్ ఖాన్‌లతో పాటు నయనతార, సత్యదేవ్ కంచరణా, హరీష్ ఉత్తమన్, జయప్రకాష్, వంశీకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ 20 నిమిషాల పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.


Next Story
Share it