ఆరో ఏట అడుగుపెట్టిన అల్లు అర్హా.. బ‌న్నీ విషెష్ వైర‌ల్‌

proud dad Arjun shares an adorable video of his cute daughter. అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కుమార్తె అల్లు అర్హా నేడు ఆరో ఏట అడుగుపెట్టింది.

By Medi Samrat  Published on  21 Nov 2022 4:56 PM IST
ఆరో ఏట అడుగుపెట్టిన అల్లు అర్హా.. బ‌న్నీ విషెష్ వైర‌ల్‌

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల కుమార్తె అల్లు అర్హా నేడు ఆరో ఏట అడుగుపెట్టింది. అల్లు అర్జున్ దంప‌తులు సోషల్ మీడియాలో అర్హాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌చేశారు. అర్హా క్యూట్‌గా తన‌తో న‌డిపిన ఓ సంభాష‌ణ‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బ‌ర్త్ డే విషెష్ తెలిపాడు అల్లు అర్జున్‌. ఆ సంభాషణ‌కు 'కందిరీగ క‌థ‌లు' అని కామెంట్ జ‌త‌చేశాడు.

వీడియోలో అర్హా.. తేనెటీగలు తనను ఎలా ఇబ్బంది పెడుతున్నాయో అల్లు అర్జున్‌కు చెబుతూ ఉంటుంది. తేనెటీగలు ఎక్కడ ఉన్నాయని తండ్రి అడగగా.. అవి ఉన్న ప్రదేశాన్ని చూపిస్తుంది అర్హా. ఆమె తన తండ్రికి తేనెటీగల గురించి ఫిర్యాదు చేస్తున్నప్పుడు.. అర్హా ముఖ కవళికలు చాలా క్యూట్‌గా ఉంటాయి. ఈ వీడియోను షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ‌చేశాడు అల్లు అర్జున్‌. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతుంది.

అంత‌కుముందు కూడా అల్లు అర్జున్ త‌న కూతురు అర్హా వీడియోలను పోస్ట్ చేశాడు. దీంతో అర్హాకు కూడా పాపులారిటీ పెరిగింది. దీంతో ఈరోజు వీడియో షేర్‌ చేయగానే అర్హా.. అల్లు అర్జున్ అభిమానుల నుండే కాక.. త‌న‌ అభిమానుల నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకుంది.


Next Story