ఓటీటీలో ఇటీవలి కాలంలో సినిమాలు చాలా తొందరగా విడుదల అవుతూ ఉన్నాయి. వీటి కారణంగా థియేటర్లకు భారీగా ఆదాయం తగ్గుతూ ఉంది. ఇంకొద్ది రోజులు ఇలాగే కొనసాగితే సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వడం కూడా కష్టమే అని అంటున్నారు. తాజాగా తెలుగు సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ఓ విధానాన్ని ప్రకటించింది. హైదరాబాద్‌లో భేటీ అయిన ఫిలిం చాంబర్ కొత్త విధానాన్ని ప్రకటించింది. అన్నిరకాల సినిమాలకు ఈ విషయంలో ఒకే తరహా నిబంధనలు సరికాదని అన్నారు.
లో బడ్జెట్ సినిమాలకు ఒక రకంగా, భారీ బడ్జెట్ సినిమాలకు మరో రకమైన నిబంధనలను నిర్దేశించింది. రూ.6 కోట్ల మేర బడ్జెట్‌తో రూపొందే సినిమాలను లో బడ్జెట్ సినిమాలుగా పరిగణించిన సమావేశం...ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత కనీసం 4 వారాల తర్వాతే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. రూ.6 కోట్లకు పైబడి బడ్జెట్‌తో రూపొందే సినిమాలను భారీ బడ్జెట్ సినిమాలుగా పరిగణించనున్నారు.. ఈ సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యాక కనీసం 10 వారాల పాటు ఓటీటీలో విడుదలకు అనుమతి ఇవ్వకూడని నిర్ణయించింది.