సినీ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి

Producer Kodali Bosubabu Passed Away. తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి

By Medi Samrat
Published on : 9 May 2022 2:04 PM IST

సినీ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందారు. గుండెపోటుతో హైదరాబాదులో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 66 ఏళ్లు. దివంగత దాసరి నారాయణరావుకు ఆయన బంధువు అవుతారు. దాసరి భార్య దివంగత పద్మకు బోసుబాబు సోదరుడి వరుస అవుతారు. కెరీర్ మొదట్లో దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా చేసిన బోసుబాబు, ఆ తర్వాత దాసరి అండతోనే నిర్మాతగా మారారు. అక్కినేని నాగేశ్వరరావుతో 'రాగదీపం', నాగేశ్వరరావు, కృష్ణలతో 'ఊరంతా సంక్రాంతి', కృష్ణతో 'ప్రజాప్రతినిధి', శోభన్ బాబుతో 'జీవనరాగం', దాసరి నారాయణరావుతో 'పోలీస్ వెంకటస్వామి' సినిమాలను నిర్మించారు. బోసుబాబుకు భార్య, నలుగులు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.






Next Story