నీతిగా బతికేవాడి జోలికి రాకు.. బండ్ల గ‌ణేష్ వార్నింగ్‌

Producer Bandla Ganesh Warns a website owner. ఓ దర్శకుడి వల్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాను ఎంతగానో ఆరాధించిన పవన్ కళ్యాణ్ కు దూరంగా

By M.S.R  Published on  29 May 2023 3:00 PM GMT
నీతిగా బతికేవాడి జోలికి రాకు.. బండ్ల గ‌ణేష్ వార్నింగ్‌

ఓ దర్శకుడి వల్ల ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ తాను ఎంతగానో ఆరాధించిన పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో ‘భీమ్లా నాయక్’ సినిమా ఈవెంట్ విషయంలో వివాదం రేగిన సంగతి తెలిసిందే. ఈవెంట్లకు రాకుండా తనను ఓ వ్యక్తి అడ్డుకుంటున్నాడని, కావాలనే తనను పిలవడం లేదని మండిపడ్డ గణేష్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇటీవల ఆయన చేసిన ట్వీట్లలో గురూజీపై మండిపడ్డారు. భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడని, అది మన గురూజీ స్పెషాలిటీ అంటూ కౌంటర్లు వేశాడు.

తాజాగా ఓ వెబ్ సైట్అధినేత పై కూడా ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్.

"తెరవెనక అంతా ఓకేనా బండ్ల గణేశా?

ఎన్నో అంశాలపై రెండు నాల్కల ధోరణి చూపించాడు బండ్ల గణేశ్. ఇప్పుడు గురూజీ విషయంలో కూడా ఆయన దాదాపు యూటర్న్ తీసుకున్నట్టు కనిపిస్తోంది." అంటూ ఓ తెలుగు వెబ్సైటు కథనాన్ని వండి వార్చగా.. దానిపై బండ్ల గణేష్ ఫుల్ ఫైర్ అయ్యాడు.

"అరే వెంకట్ రెడ్డి నువ్వు పెద్ద బ్రోకర్, ఇక్కడ మీ మూర్తి గాడు చిన్న బ్రోకర్. నీలి వార్తలు రాసుకొని, నీలి బతుకులు బతుకుతూ.. దొంగచాటుగా తిరిగే నీకు మా గురించి ఎందుకురా లఫుట్. మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ప్రాణం ఇస్తాం, కోపం వస్తే అలుగుతాం. ప్రేమించినప్పుడు, పూజించినప్పుడు అలిగే హక్కు కూడా ఉంటుందిరా లఫుట్. సినిమా వాళ్ళ వార్తలు, సినిమా వాళ్ళ ఇంటర్వ్యూలు లేకపోతే నీకు పప్పం గడవదురా వెంకీగా. నువ్వు మనిషివైతే నీకు సిగ్గు, శరం ఉంటే నువ్వు తినేది అన్నమే అయితే ఒక్కసారి ప్రత్యక్షంగా నాకు కనపడు.. నీలీ వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాలు గురించి చూసుకోరా బఫున్ కొడకా..

నిజాయితీగలడితో దూరంగా ఉండటానికి ప్రయత్నించు. నీతిగా బతికేవాడి జోలికి రాకు

మాడి మసై పోతావ్" అంటూ పోస్టు పెట్టాడు బండ్ల గణేష్. ఈ ఫైర్ ఏంటన్నా అంటూ అభిమానులు తెగ షాక్ అవుతూ ఉన్నారు.


Next Story