రష్మికకు కొత్త హీరోయిన్ షాక్..!

Priyanka Arul Mohan shock to Rashmika. టాలీవుడ్ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన అతికొద్ది సమయంలోనే టాప్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకున్న రష్మికకు కొత్త హీరోయిన్ షాక్.

By Medi Samrat  Published on  22 Jan 2021 4:13 AM GMT
Priyanka Arul Mohan shock to Rashmika

టాలీవుడ్ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టిన అతికొద్ది సమయంలోనే టాప్ హీరోలతో నటించే అవకాశాలు దక్కించుకున్న రష్మికా మండన్న వరుస అవకాశాలతో దూసుకు పోతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ సంపాదించుకున్న రష్మికకు అప్ కమింగ్ హీరోయిన్ భారీగా షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరని అనుకుంటున్నారా? ఆ హీరోయిన్ మరెవరో కాదు నాని గ్యాంగ్ లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్.


ప్రస్తుతం ఈ హీరోయిన్ శర్వానంద్ నటిస్తున్న "శ్రీకారం"సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ప్రస్తుతం "ఆకాశమే నీ హద్దురా"సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరించిన సూర్యకి ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ ఎంతో మంది ప్రేక్షక అభిమానులు ఉన్నారు. ఈ సినిమా తర్వాత సూర్య ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ తో కలిసి మరో సినిమాలో నటించనున్నారు.

సూర్య కొత్త ప్రాజెక్టులో ముందుగా హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేశారు. కానీ రష్మికకు భారీ రెమ్యూనరేషన్ చెల్లించుకోలేక నిర్మాతలు ఆమెను హీరోయిన్ గా తీసుకోవడానికి వెనకడుగు వేశారు. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం ప్రియాంక అరుల్ మోహన్ దక్కించుకున్నారు. ఈ సినిమాకి డీ ఇమ్మాన్ సంగీత దర్శకుడిగా ఎంపిక చేసారు. సూర్య హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా సన్ పిక్చర్ బ్యానర్ పై నిర్మించనున్నారు. సూర్య నటించిన "ఆకాశమే నీ హద్దురా" ఓటీటీ ద్వారా విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుందని చిత్రబృందం తెలియజేశారు.


Next Story
Share it