'ప్రేమలు' సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పటి నుండే..!

ప్రేమలు అనే మలయాళ చిత్రం తెలుగులో కూడా మాంచి హిట్ అయింది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది

By Medi Samrat  Published on  31 March 2024 9:30 PM IST
ప్రేమలు సినిమా ఓటీటీలోకి వచ్చేది అప్పటి నుండే..!

ప్రేమలు అనే మలయాళ చిత్రం తెలుగులో కూడా మాంచి హిట్ అయింది. హైదరాబాద్ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఇతర భాషల ప్రేక్షకులను కూడా ఆకర్షించింది. ఇప్పుడు, ప్రేమలు OTT స్ట్రీమింగ్ తేదీ అధికారికంగా ప్రకటించారు. ప్రేమలు మలయాళంలో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూలు చేయగలిగింది. మంజుమ్మెల్ బాయ్స్, 2018, లూసిఫెర్ సినిమాల తర్వాత మలయాళ భాషలో అత్యధిక వసూళ్లు చేసిన 4వ చిత్రంగా నిలిచింది. మలయాళంలో విజయం సాధించడంతో తెలుగులోనూ విడుదలైంది.

ఇక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు-డబ్బింగ్ మలయాళ చిత్రంగా నిలిచింది. ప్రేమలు చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్.కార్తికేయ పంపిణీ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాషల్లో 15 కోట్లకు పైగా వసూలు చేసింది. ఏకంగా 125 కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా టచ్ చేసింది. ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి స్ట్రీమింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ప్రేమలు ఓటీటీ డేట్ ను లాక్ చేశారు. ప్రేమలు ఏప్రిల్ 12న ప్రముఖ OTT దిగ్గజం, Disney+Hotstarలో తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ప్రసారం కానుంది.

Next Story