కవలలకు తల్లైన ప్రీతీ జింటా

Preity Zinta And Gene Goodenough Welcome Twins Via Surrogacy. సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా దంపతులు ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రీతి జింటా, జీన్ గూడెనఫ్

By Medi Samrat
Published on : 18 Nov 2021 12:59 PM IST

కవలలకు తల్లైన ప్రీతీ జింటా

సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా దంపతులు ఓ గుడ్ న్యూస్ పంచుకున్నారు. ప్రీతి జింటా, జీన్ గూడెనఫ్ జంట గురువారం తమకు కవలలు జై, గియా పుట్టారని వెల్లడించారు. సరోగసీ ద్వారా పిల్లలు పుట్టినట్లు ప్రకటించారు. తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను పంచుకుంటూ ప్రీతీ జింటా ఓ పోస్టును పెట్టారు. "అందరికీ హాయ్, నేను ఈ రోజు ఓ అద్భుతమైన వార్తను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను మరియు జీన్ చాలా సంతోషిస్తున్నాము. మా హృదయాలు చాలా కృతజ్ఞతతో నిండి ఉన్నాయి మేము మా కవలలు జై జింటా గూడెనఫ్ మరియు గియా జింటా గూడెనఫ్‌లను మా కుటుంబంలోకి స్వాగతిస్తున్నాము.

మా జీవితంలో ఈ కొత్త దశ గురించి మేము చాలా సంతోషిస్తున్నాము.ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు వైద్యులు, నర్సులు మరియు మా సర్రోగేట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు" అని తెలిపారు. ప్రీతి జింటా ఫిబ్రవరి 29, 2016న జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకుని లాస్ ఏంజెల్స్‌కు వెళ్లింది. తమ కవలలు జై మరియు గియా గురించి ఈ జంట చేసిన ప్రకటన వారి అభిమానులను ఆశ్చర్యపరిచింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు అదే బాటలో ప్రీతీ జింటా జంట కూడా పయనించింది.


Next Story