సలార్-2 కు సంబంధించి సంచలన అప్డేట్

సలార్ పార్ట్ 1 విడుదలై ఏడాది కావస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

By Medi Samrat  Published on  22 Dec 2024 10:18 AM GMT
సలార్-2 కు సంబంధించి సంచలన అప్డేట్

సలార్ పార్ట్ 1 విడుదలై ఏడాది కావస్తోంది. ఈ సినిమాను ఓటీటీలో కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. పార్ట్-2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూ ఉండగా.. సలార్ పార్ట్ 2 కు సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ప్రశాంత్ నీల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సలార్ మొదటి భాగం దర్శకుడిగా తనకు సంతృప్తిని కలిగించలేదట. సలార్ 2 సినిమాకు మాత్రం తన బెస్ట్ వర్క్ చూపిస్తానని హామీ ఇచ్చారు . సలార్ థియేట్రికల్ అవుట్‌పుట్‌తో తాను కొంచెం నిరాశకు గురయ్యానని, ప్లానింగ్ దశలో ఉన్న సలార్ 2 కోసం తన బెస్ట్ రైటింగ్ పెట్టానని చెప్పాడు. ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఇది తన అత్యుత్తమ వర్క్ గా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తానని నీల్ చెప్పారు.

Next Story