హను-మాన్‌ రిలీజ్ డేట్ వాయిదా

Prasanth Varma, Teja Sajja's 'HANU-MAN' postponed. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను-మాన్‌' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

By Medi Samrat  Published on  5 May 2023 8:15 PM IST
హను-మాన్‌ రిలీజ్ డేట్ వాయిదా

Prasanth Varma, Teja Sajja's 'HANU-MAN' postponed


ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న 'హను-మాన్‌' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాను మే 12న విడుదల చేయాలని భావించారు. అయితే, అది వాయిదా పడింది. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఉన్న అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా.. మేకర్స్ భారీగా వీఎఫ్ఎక్స్ ఉండేలా ప్లాన్ చేస్తూ ఉన్నారు.

బిగ్ స్క్రీన్ పై ‘హనుమాన్‌’ను మీకు చూపించేందుకు మేము ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నామని.. త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్తో సహా పలు భాషలలో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల కానుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.


Next Story