'హ‌నుమాన్' నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్.. హాలీవుడ్ లెవెల్‌లో సూప‌ర్ విల‌న్‌

Vinay Rai First look poster from Hanu-Man movie.అ! చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ త‌రువాత క‌ల్కి,

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Jun 2022 12:29 PM IST
హ‌నుమాన్ నుంచి ఇంట్రెస్టింగ్ పోస్ట‌ర్.. హాలీవుడ్ లెవెల్‌లో సూప‌ర్ విల‌న్‌

'అ!' చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన ప్ర‌శాంత్ వ‌ర్మ ఆ త‌రువాత 'క‌ల్కి', 'జాంబిరెడ్డి' వంటి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌దిలో త‌న‌దైన ముద్ర వేశాడు. ప్ర‌స్తుతం ఈ ద‌ర్శ‌కుడు తేజ స‌జ్జ‌తో 'హ‌ను-మాన్' అనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. అమృత అయ్యర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.ఒక్కో క్యారెక్ట‌ర్‌కు స్పందించిన పోస్ట‌ర్ల‌ను రివీల్ చేస్తూ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేస్తున్నారు.

తాజాగా ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్న విన‌య్ రాయ్ లుక్‌ను హీరో రానా దగ్గుబాటితో రివీల్ చేయించింది చిత్ర‌బృందం. ఇందులో విన‌య్‌.. ముఖానికి గ్యాస్ మాస్క్ పెట్టుకుని, ఒక క‌న్నును ఐ పాచ్‌తో మూసేసి తన సైన్యంతో ఓ హాలీవుడ్ సూపర్ విలన్ ని తలపించే లుక్ మరియు కాస్ట్యూమ్స్ లో కనిపిస్తునాడు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఒక్క పోస్ట‌ర్‌తో సినిమా మామూలుగా ఉండ‌దు అని చెప్ప‌క‌నే చెప్పేశారు.

Next Story