మ‌రో డ్యాన్స్ వీడియో షేర్ చేసిన‌ ప్రణీత.. నెట్టింట వైర‌ల్‌

Pranitha Subhash danceVideo goes Viral. నటి ప్రణీత సుభాష్ తాను గర్భవతి అంటూ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  25 April 2022 4:15 PM IST
మ‌రో డ్యాన్స్ వీడియో షేర్ చేసిన‌ ప్రణీత.. నెట్టింట వైర‌ల్‌

నటి ప్రణీత సుభాష్ తాను గర్భవతి అంటూ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే..! ఆమె అభిమానులు సినీ ప్రముఖులు ప్రణీతకు శుభాకాంక్షలు చెప్పారు. నటి తాను గర్భవతిని అని ధృవీకరిస్తూ కొన్ని చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, తాము తల్లిదండ్రులం కాబోతున్నామని తెలుపుతూ స్కానింగ్ రిపోర్ట్ చూపించింది. తన భర్త తనను ఎత్తుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ విషయాన్ని రివీల్ చేసింది ప్రణీత. ఈ ఫొటోల్లో ప్రణీత, ఆమె భర్త ఎంతో ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. భర్తను హగ్ చేసుకుంటూ తాను గర్భవతిని అనే విషయాన్ని వెల్లడించింది ప్రణీత. ప్రెగ్నెన్సీ రోజుల్లో చాలా కేర్ తీసుకుని ఉండాలని ప్రణీతకు పలువురు సూచించారు. ప్రణీత

ఆమె తాజాగా సోషల్ మీడియా పోస్ట్‌లో, "డ్యాన్స్ టు డ్రైవింగ్ ఆల్ ప్రెగ్నెన్సీ బ్లూస్...మేజర్ త్రోబాక్" అని క్యాప్షన్ ఇచ్చింది. అప్పుడెప్పుడో తాను డ్యాన్స్ చేసిన వీడియో అంటూ జుగ్ను పాటకు చేసిన డ్యాన్స్ వీడియోను ప్రణీత పోస్ట్ చేసింది.

మరో వైపు కాబోయే తల్లిగా తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన అనేక ఫోటోలను ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. ఆమె తన వారాంతపు కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నటి పూల్‌ పక్కన కొంత విశ్రాంతి సమయాన్ని ఆస్వాదిస్తూ కనిపించింది. ప్రణిత సుభాష్ తన ఫిట్‌నెస్ రొటీన్‌ గురించి కూడా పంచుకుంది. ఆమె జిమ్‌లో లైట్ స్ట్రెచ్‌లు చేయడం చూడవచ్చు. ఇలా సోషల్ మీడియాలో ప్రణీత యాక్టివ్ గానే ఉంటోంది.

Next Story