రౌండ్-2 అంటూ.. రెండోసారి గుడ్‌న్యూస్ చెప్పిన‌ హీరోయిన్‌

టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ ప్రణీత సుభాష్ రెండో సారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది

By Medi Samrat  Published on  25 July 2024 3:46 PM IST
రౌండ్-2 అంటూ.. రెండోసారి గుడ్‌న్యూస్ చెప్పిన‌ హీరోయిన్‌

టాలీవుడ్‌లో నటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్‌ ప్రణీత సుభాష్ రెండో సారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్రణీత సుభాష్ ఇటీవల ప్రెగ్నెన్సీ ఫోటోషూట్ చేసి తన రెండవ ప్రెగ్నెన్సీని ప్రకటించింది. అంతకుముందు ఆమె 2022 లో మొదటి బిడ్డకు జన్మనిచ్చింది.

2021లో ప్రణిత సుభాష్ ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజును వివాహం చేసుకున్నారు. ఒక సంవత్సరం తరువాత ఆమె కుమార్తెకు జన్మనిచ్చింది. తాజ‌గా గురువారం ప్రణిత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఓ పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా తాను రెండో సారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

ఇందుకు సంబంధించి తాజా ఫోటోషూట్ చిత్రాలను షేర్ చేసింది. అందులో ఆమె తన బేబీ బంప్‌ని చూపిస్తూ.. రౌండ్ 2.. ఈ ప్యాంట్‌లు ఇకపై సరిపోవు అని క్యాప్ష‌న్ రాసింది. ఈ పోస్టుతో ప్రణీత రెండోసారి తల్లి కాబోతున్నట్లు అభిమానులకు తెలియజేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమ‌నులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రణిత 3 ఏళ్లలోపు రెండోసారి గర్భం దాల్చడంతో ఆమె పేరు చర్చనీయాంశమైంది.

2010లో కన్నడ చిత్రం పోర్కీతో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన ప్రణిత సుభాష్.. తమిళం, తెలుగు భాషలలో ప‌లు చిత్రాలలో న‌టించారు. ఆమె పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సిద్ధార్థ్, రామ్‌ వంటి చాలా మంది నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

Next Story