టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ స్పందించారు. భావి తరాలను నాశనం చేసే డ్రగ్స్‌ను ఉపేక్షించవద్దన్నారు. డ్రగ్స్ కేసులో ఎవరున్నా.. దోషులుగా తేలితే శిక్షించాల్సిందేనని చెప్పారు. 'మా' ఎన్నికలు జరుగుతున్న వేళ తమ ప్యానెల్‌లో ఉన్న తనీష్‌పై వచ్చినవి ఆరోపణలు మాత్రమేనని.. ఆరోపణలు రుజువైతే ఎంతటివారినైనా కఠినంగా శిక్షించాల్సిందేనని ప్రకాశ్‌రాజ్ స్పష్టం చేశారు. మరోవైపు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. ఇవాళ ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్‌ను దాదాపు ఆరు గంటల పాటు ప్రశ్నించింది. తర్వాత ఈడీ సెప్టెంబర్ 8న రాణా దగ్గుబాటిని, 9వ తేదీన రవితేజతో పాటు డ్రైవర్ శ్రీనివాస్ ను విచారించనుంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఇదిలావుంటే.. అక్టోబర్ 10న 'మా' ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమ శిక్షణ కమిటీ తమ ప్రకటనలో వెల్లడించింది.