మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ చాట్ వైరల్

Prakash Raj Manchu Vishnu Whatsapp Chat Goes Viral. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు

By Medi Samrat  Published on  11 Oct 2021 2:24 PM IST
మంచు విష్ణు-ప్రకాష్ రాజ్ చాట్ వైరల్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యారు. ప్రకాశ్‌రాజ్‌పై మంచు విష్ణు 107 ఓట్ల తేడాతో విజయం సాధించారు. విష్ణుకు 381 ఓట్లు రాగా, ప్రకాశ్‌రాజ్‌కు 274 ఓట్లు పోలయ్యాయి. మా అసోసియేషన్‌లో మొత్తం 883 మందికి ఓటు హక్కు ఉండగా, ఈసారి రికార్డు స్థాయిలో 665 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 'మా' ఎన్నికల్లో ఓటమి అనంతరం సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నిక‌ల నేప‌థ్యంలో తనను నాన్ లోకల్ అంటూ, తెలుగువాడు కాదంటూ చేసిన వ్యాఖ్యలను మీడియా స‌మావేశంలో ప్రస్తావించారు. ప్రాంతీయ వాదం తెర‌పైకి వ‌చ్చింద‌ని ప్ర‌కాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా ఎన్నిక‌ల్లో చాలా మంది ఓటు హ‌క్కును వినియోగించుకున్నార‌ని, వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు.

ఈ ఎన్నిక‌లు ప్రాంతీయ‌, జాతీయవాదం భావోద్వేగాల‌ మ‌ధ్య జ‌రిగాయ‌ని చెప్పుకొచ్చారు. తెలుగు బిడ్డ‌ను మా అధ్య‌క్షుడిగా ఎన్నుకున్నార‌ని చెప్పారు. తాను తెలుగు బిడ్డ‌ను కాద‌ని.. మా ప్రాథమిక స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌కాశ్ రాజ్ అన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మంచు విష్ణుకు ప్రకాష్ రాజ్ మెసేజ్ చేశారు. అయితే గెలుపోటములు సహజమని.. దయచేసి మా సభ్యత్వానికి రాజీనామా చేయకండి అని విష్ణు ప్రకాష్ రాజ్ ను కోరారు. ఎమోషనల్ అవ్వకండి.. కలిసి మాట్లాడుకుందామని కూడా విష్ణు ప్రకాష్ రాజ్ కు తెలిపారు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను మంచు విష్ణు తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దాన్ని మీరు కూడా ఇక్కడ చూడొచ్చు.



Next Story