సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ మద్దతు

Prakash Raj joins chorus of support for Sai Pallavi. నటి సాయిపల్లవి ఇటీవల కశ్మీరీ పండిట్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో

By Medi Samrat
Published on : 19 Jun 2022 4:15 PM IST

సాయి పల్లవికి ప్రకాష్ రాజ్ మద్దతు

నటి సాయిపల్లవి ఇటీవల కశ్మీరీ పండిట్ల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని.. సాయిపల్లవి భావించారు. అందుకు సంబంధించి ఓ వీడియో రిలీజ్ చేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను మాట్లాడిన మాటల్లో కొన్నింటినే పరిగణనలోకి తీసుకుని తప్పుడు ప్రచారం చేశారని వెల్లడించారు. హింస అనేది ఏ రూపంలో ఉన్నా దాన్ని ఖండించాల్సిందేనని.. తాను మొదట ఓ డాక్టర్ నని, ప్రాణం విలువ తనకు తెలుసని అన్నారు. ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని స్పష్టం చేశారు. ఏదేమైనా తన వ్యాఖ్యలు ఎవరినైనా నొప్పించి ఉంటే అందుకు తనను క్షమించాలని అన్నారు.

ఇలా నేను మీ ముందుకు వచ్చి ఓ విషయం మీద క్లారిటీ ఇవ్వడం మొదటి సారి జరుగుతోంది. మాట్లాడే ముందు ఇలా ఒకటికి రెండు సార్లు ఆలోచించడం కూడా బహుశా ఇదే మొదటి సారి.. ఎందుకంటే నేను మాట్లాడిన మాటలు తప్పుగా అందరికీ అర్థమయ్యాయన్నారు సాయి పల్లవి.

తాజాగా సాయి పల్లవికి నటుడు ప్రకాష్ రాజ్ అండగా నిలిచారు. హ్యూమానిటీ అన్నికంటే ముందు అని.. సాయిపల్లవి మేము నీతోనే ఉన్నామంటూ ఆయన మద్దతు ఇచ్చారు. సాయి పల్లవి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ ప్రకాష్ రాజ్ పోస్ట్ పెట్టారు.











Next Story