జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి టార్గెట్ చేశారు. ఇటీవల జరిగిన ఒక టెలివిజన్ ఇంటర్వ్యూలో, ప్రకాష్ రాజ్ జాతీయ అవార్డులు, రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు, ఆ సందర్భంగా ఆయన పవన్ కళ్యాణ్ గురించి కూడా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తొలిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, ఆయన తరచుగా ప్రజా సమస్యల గురించి ఉద్వేగభరితంగా మాట్లాడేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ విషయాలను ప్రస్తావించడం లేదని విమర్శించారు ప్రకాష్ రాజ్.
అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారన్నారు ప్రకాష్ రాజ్. రాష్ట్రంలో నిరుద్యోగం ఉంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించకుండా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించారు. రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదన్నారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నానని ప్రకాష్ రాజ్ విమర్శించారు.