మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను లాగడంపై ప్రకాష్ రాజ్ సీరియస్

Prakash Raj Comments On Manchu Vishnu. మా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఎన్నో వివాదాలు బయటకు వస్తూ ఉంటాయి.

By Medi Samrat  Published on  1 Oct 2021 1:59 PM GMT
మా ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను లాగడంపై ప్రకాష్ రాజ్ సీరియస్

మా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఎన్నో వివాదాలు బయటకు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం మా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతూ ఉంది. ఈ నెల 10న మా అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రకాష్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లోకి పవన్ కళ్యాణ్‌ను అనవసరంగా లాగుతున్నారు.. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడండి అంటూ వార్నింగ్ ఇచ్చారు ప్రకాష్ రాజ్.

పవన్ సినిమా మార్నింగ్ షో కలక్షన్ అంత ఉండదు మీ సినిమా బడ్జెట్ అంటూ విమర్శించారు ప్రకాష్ రాజ్. పవన్ కళ్యాణ్ మొదట నటుడు.. ఆ తర్వాతే రాజకీయనాయకుడని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. చిరంజీవి, కృష్ణ గారు అందరి వారు వారిని ఎందుకు ఇందులోకి లాగుతున్నారని ప్రకాష్ రాజ్ అన్నారు. మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి సూపర్ స్టార్ కృష్ణ నివాసానికి వచ్చారు. వారి వెంట మోహన్ బాబు కూడా వచ్చారు. కృష్ణకు పాదాభివందనం చేసిన మంచు విష్ణు మా ఎన్నికల అంశంపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో ఆయన ఆశీస్సులు తమపై ఉండాలని కోరారు. కృష్ణ మంచు విష్ణు ప్యానెల్ కు ఆల్ ద బెస్ట్ చెప్పారు.


Next Story