రెండో పెళ్లికి సిద్ద‌మ‌వుతున్న ప్ర‌భుదేవా..! అమ్మాయి ఎవ‌రింటే..?

Prabhudeva Ready For Second Marriage. కెరీర్‌లో స‌క్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్ర‌భుదేవా. కొరియోగ్రాఫ‌ర్‌గా

By Medi Samrat  Published on  13 Nov 2020 8:41 AM GMT
రెండో పెళ్లికి సిద్ద‌మ‌వుతున్న ప్ర‌భుదేవా..! అమ్మాయి ఎవ‌రింటే..?

కెరీర్‌లో స‌క్సెస్ పుల్‌గా దూసుకెళ్తున్నాడు ప్ర‌భుదేవా. కొరియోగ్రాఫ‌ర్‌గా, డ్యాన్స‌ర్‌గా, ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన శైలిలో రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఇండియ‌న్ మైఖేల్ జాక్స‌న్ మ‌ళ్లీ పెళ్లి చేసుకోనున్న‌రా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కెరీర్‌లో ఎలాంటి ఢోకా లేకుండా వెళుతున్న ప్రభుదేవాకు వ్యక్తిగత జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదరయ్యాయి. ప్రేమ, పెళ్లి ఇలా రెండింటిలోనూ విఫలమయ్యారు.

1995లో రామలతను వివాహం చేసుకున్నాడు. 2011లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ త‌రువాత హీరోయిన్‌ న‌య‌న‌తారతో ప్రేమ చిగురించింది. ఇక ఎంత పెద్ద హాట్ టాపిక్ అయ్యిందో అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికి.. అది జ‌ర‌గ‌లేదు. ప్ర‌స్తుతం ప్రస్తుతం ప్రభుదేవా రెండో పెళ్లికి సిద్ధం అయినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

గత కొన్ని రోజులుగా మేన కోడలు వరుస అయ్యే అమ్మాయితో రిలేషన్‌లో ఉంటోన్న ప్రభుదేవా, ఆమెను త్వరలోనే పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌తో కలిసి ప్రభుదేవా 'రాదే' సినిమా చేస్తున్నాడు. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీటీలో విడుదల చేసేది లేదని వచ్చే ఏడాది జనవరిలో లేదా ఈద్‌ పండగకు థియేటర్స్‌లనే రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తునట్లు ప్రభుదేవా వెల్లడించారు.


Next Story