కొంచెం గ్యాప్ ఇవ్వండయ్యా.. మరో రీరిలీజ్

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు నాడు

By Medi Samrat  Published on  9 Aug 2023 2:15 PM GMT
కొంచెం గ్యాప్ ఇవ్వండయ్యా.. మరో రీరిలీజ్

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తూ ఉంది. ఆగస్టు 9 మహేష్ బాబు పుట్టినరోజు నాడు బిజినెస్ మ్యాన్ సినిమా మూవీ లవర్స్ కు ఫుల్ మీల్స్ పెడుతోంది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మరో స్టార్ హీరో సినిమాను థియేట‌ర్ల‌లో విడుదల చేయనున్నారు. ఆ స్టార్ హీరో ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యారనుకోండి.. ప్రభాస్ ఫ్లాప్ మూవీని మరోసారి రిలీజ్ చేయనున్నారు. యోగి సినిమాను మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

ఆగ‌స్ట్ 18న ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. తాజాగా యోగి సినిమా రీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేశారు. ప్ర‌భాస్, ద‌ర్శ‌కుడు వీవీ వినాయ‌క్ కాంబినేష‌న్‌లో 2007లో రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఛ‌త్ర‌ప‌తి సూప‌ర్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన రెండో మూవీ ఇది. ఈ సినిమాకు ముందు పౌర్ణమి కూడా ఫ్లాప్ గా నిలిచింది. యోగి సినిమా రీమేక్. ముఖ్య మంత్రి వైయ్యెస్.రాజశేఖరరెడ్డి బావమరది అయిన కడప మేయర్ పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఈ చిత్రాన్ని సమర్పించారు. కన్నడలో వచ్చిన జోగికి మార్పులు చేసి తెలుగులో విడుదల చేశారు. 2007 టైమ్‌లో 225కుపైగా థియేట‌ర్ల‌లో రిలీజై రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మ‌ద‌ర్ సెంటిమెంట్ మరీ ఎక్కువైపోయిందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. యోగిలో ప్ర‌భాస్‌కు జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. సీనియ‌ర్ న‌టి శార‌ద తల్లి పాత్రలో చేశారు. యోగి సినిమాకు ర‌మ‌ణ గోగుల సంగీతాన్ని అందించారు. సాంగ్స్ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే..!

Next Story