బాహుబలి నాకు బిరియానీ పంపించాడంటూ తెగ మురిసిపోయిన్న బెబో

Prabhas treats 'Adipurush' co-star Saif Ali Khan and family to a biryani dinner. ప్రభాస్ తో సినిమా అంటే చాలు.. సినిమా యూనిట్ కు భోజనం ఒక రేంజిలో

By Medi Samrat  Published on  26 Sept 2021 4:38 PM IST
బాహుబలి నాకు బిరియానీ పంపించాడంటూ తెగ మురిసిపోయిన్న బెబో

ప్రభాస్ తో సినిమా అంటే చాలు.. సినిమా యూనిట్ కు భోజనం ఒక రేంజిలో తినిపిస్తూ ఉంటారు. గతంలో ఇదే విషయాన్ని పలువురు సెలెబ్రిటీలు చెప్పారు. తాజాగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌ లో మన ప్రభాస్ ను మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయింది. ప్రభాస్ పంపిన బిర్యానీలను తిన్న కరీనా.. తాను ది బెస్ట్ బిరియానీని టేస్ట్ చేశానని తెలిపింది. బాహుబలి మాకు అత్యుత్తమైన బిర్యానీ పంపారని.. అందుకు ధన్యవాదాలు ప్రభాస్ అని ఆమె ఆదిపురుష్ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. 'బాహుబ‌లి బిర్యానీ పంపించాడంటే అది క‌చ్చితంగా బెస్ట్‌ అయ్యి ఉంటుంది. థ్యాంక్యూ ప్రభాస్, ఇలాంటి అద్భుతమైన భోజనం పంపినందుకు' అని బెబో చెప్పుకొచ్చింది. ప్రభాస్ మరియు కరీనా భర్త, నటుడు సైఫ్ అలీ ఖాన్ కలిసి ఆదిపురుష్‌లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తూ ఉండగా, కృతి సనన్ సీతగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో నటించారు. సైఫ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. సైఫ్‌తో మొదటిసారి నటించడంపై ప్రభాస్ ఇంతకు ముందు మాట్లాడుతూ "సైఫ్ అలీ ఖాన్ వంటి ప్రతిభావంతులైన నటుడితో పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. గొప్ప నటుడితో కలిసి నటించడం నాకు గర్వకారణం" అని చెప్పుకొచ్చాడు. 'తానాజీ: ది అన్సంగ్ వారియర్' కు దర్శకత్వం వహించిన ఓం రౌత్ ఆదిపురుష్ ను భారీ స్థాయిలో తెరకెక్కిస్తూ ఉన్నారు.


Next Story