ప్రభాస్ కు శస్త్రచికిత్స..?

Prabhas surgery goes viral on social media. బాహుబలి హీరో ప్రభాస్ విదేశాలలో తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారనే

By Medi Samrat  Published on  29 July 2022 8:19 PM IST
ప్రభాస్ కు శస్త్రచికిత్స..?

బాహుబలి హీరో ప్రభాస్ విదేశాలలో తన కాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వార్త విన్న అతని అభిమానులలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రెస్ మీట్ సందర్భంగా టాలీవుడ్ నిర్మాత అశ్విని దత్ మీడియాకు ఈ వార్తను వెల్లడించారు. ఫారిన్‌లో సర్జరీ చేయించుకోవడం వల్లే 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ హాజరవ్వలేదని టాక్ నడుస్తోంది. గతంలో ప్రభాస్ స్పెయిన్ లో సర్జరీ చేయించుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక త్వరలో ఆది పురుష్ సినిమా ద్వారా ప్రభాస్ అభిమానులను అలరించబోతున్న సంగతి తెలిసిందే.

ఇక ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' అక్టోబర్ 2023, జనవరి 2024లో విడుదల కానుందని నిర్మాత అశ్వినీదత్ తెలిపారు. 'ప్రాజెక్ట్ K'ని 'అవెంజర్స్'తో అశ్విని దత్ పోల్చారు. భారీ స్థాయిలో సినిమా విడుదల కాబోతోందని అన్నారు. ప్రభాస్, బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా చాలా గొప్పగా వస్తోందని అన్నారు. ముఖ్యంగా అమెరికా, చైనా మార్కెట్ లపై ప్రధానంగా దృష్టి పెట్టామని అంటున్నారు అశ్వినీదత్.










Next Story