మొదలైన 'సలార్' సినిమా టికెట్స్ బుకింగ్స్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాపై

By Medi Samrat  Published on  23 Aug 2023 8:30 PM IST
మొదలైన సలార్ సినిమా టికెట్స్ బుకింగ్స్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'సలార్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ కు కేవలం నెలరోజులు మాత్రమే సమయం ఉంది. అయితే అమెరికాలో 'సలార్' అడ్వాన్స్ బుకింగ్ లు ప్రారంభించారు. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ చిత్రం ప్రమోషన్స్ ను సెప్టెంబర్ తొలి వారం నుంచి ప్రారంభిస్తున్నారు. సెప్టెంబర్ 28న సినిమా విడుదల కానుంది.

ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం యూఎస్ లో 'సలార్' ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్ టైమ్ హై లో దూసుకుపోతోంది. ఒక్క USలో మాత్రమే, 'సలార్'వి అప్పుడే దాదాపు 4,000 టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పటికే 128,980 డాలర్ల ఆదాయాన్ని సొంతం చేసుకున్నాయి. USలో 'సాలార్' ప్రీ-సేల్స్ ఇప్పటికే $100,000 ఆకట్టుకునే మైలురాయిని సొంతం చేసుకున్నాయని నెటిజన్లు చెబుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో సినిమా బుకింగ్స్ ఇంకా భారీగా ఉండనున్నాయి. ప్రభాస్ 'సలార్' సినిమా ఈ సంవత్సరం అత్యంత భారీ అంచనాలతో విడుదలయ్యే చిత్రాలలో ఒకటి. కేజీఎఫ్ తో భారీ సక్సెస్ ను అందుకున్న ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన 'సలార్' యాక్షన్-ప్యాక్డ్ డ్రామా అని చెబుతున్నారు.

Next Story