ప్రభాస్ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా.. ఈ ఆఫర్ మీకోసమే

Prabhas Salar Movie Casting Call. కేజీఎఫ్ చిత్రం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 చిత్రీక‌ర‌ణ‌లో

By Medi Samrat  Published on  9 Dec 2020 12:47 PM GMT
ప్రభాస్ సినిమాలో నటించాలని అనుకుంటున్నారా.. ఈ ఆఫర్ మీకోసమే

కేజీఎఫ్ చిత్రం ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌స్తుతం కేజీఎఫ్ పార్ట్ 2 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త‌రువాత బాహుబలి స్టార్ ప్రభాస్ తో ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ చిత్రాన్ని చేయ‌నున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న ఇటీవలే వ‌చ్చేసింది. కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ట్విట్టర్‌లో కెజియఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తో ప్రభాస్‌ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది. 'ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్' అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ "సలార్" టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సినిమా మీద ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అందుకున్నాయి. తాజాగా ఈ సినిమాలో నటించాలని అనుకునే వారి కోసం ఆడిషన్స్ ను తీసుకుని వస్తున్నారు.


ఈ చిత్రంలో కొత్త నటీనటులకు అవకాశాలు కల్పించబోతున్నారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేసింది. 'మీలోని ప్రతిభను చూపించి, అవకాశాన్ని దక్కించుకోండి.. సలార్ లో నటించే ఛాన్స్ ను మిస్ కాకండి' అంటూ సంస్థ పేర్కొంది. ఈ నెల 15న హైదరాబాదు శివారు గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడిషన్స్ ను నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఆ రోజు ఉదయం 9 నుంచి సాయంకాలం 6 వరకు ఆడిషన్స్ ఉంటాయనీ, ఒక నిమిషం నిడివి నటనతో కూడిన వీడియోతో అక్కడికి రావాలనీ కోరింది. టాలెంట్ వున్న వారు ఏ వయసు వారైనా రావచ్చని, అన్ని కేటగిరీలకూ ఆడిషన్స్ వుంటాయని తెలిపారు. హైదరాబాదు తర్వాత బెంగళూరు, చెన్నైలలో ఆడిషన్స్ ను నిర్వహిస్తామని చిత్ర బృందం చెబుతోంది.


Next Story
Share it