ప్రభాస్‌ 'రాధేశ్యామ్' నుండి అప్‌డేట్ వ‌చ్చిందోచ్‌..!

Prabhas radhe shyam first song on nov 15. బహుబలితో సినిమా ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు. ఆ తర్వాత ప్రభాస్‌ వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్టులకు సైన్‌ చేస్తూ..

By అంజి  Published on  13 Nov 2021 12:12 PM IST
ప్రభాస్‌ రాధేశ్యామ్ నుండి అప్‌డేట్ వ‌చ్చిందోచ్‌..!

బహుబలితో సినిమా ప్రభాస్‌ పాన్‌ ఇండియా స్టార్‌గా మారారు. ఆ తర్వాత ప్రభాస్‌ వరుసగా పాన్‌ ఇండియా ప్రాజెక్టులకు సైన్‌ చేస్తూ.. సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నాలుగైదు పాన్‌ ఇండియా సినిమాలను ప్రభాస్‌ లైన్‌లో పెట్టాడు. తాజాగా ఆయన నటించిన సినిమా రాధేశ్యామ్‌ జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవ్వబోతోంది. మహమ్మారి కరోనా కారణంగా ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతున్న సినిమా యూనిట్‌ నుండి ఎలాంటి ప్రకటనలు రావడం లేదు. రాధేశ్యామ్‌ మూవీ మేకర్స్‌ ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడంతో ప్రభాస్‌ అభిమానులు చాలా ఆందోళన పడుతున్నారు. ఓ అభిమాని అయితే ఏకంగా సూసైడ్‌ లెటర్‌ కూడా రాశాడు.

అయితే సోషల్‌ మీడియాలో గత రెండు రోజుల నుండి త్వరలోనే రాధేశ్యామ్‌ నుండి ఫస్ట్‌ సింగిల్‌ని విడుదల చేస్తారంటూ టాక్‌ వినబడుతోంది. ఈ క్రమంలోనే సినిమా యూనిట్‌ నుండి క్రేజీ అప్‌డేట్‌ వచ్చింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు ఈ రాతలే అంటూ సాగే ఓ పాటను విడుదల చేయనున్నారు. ఈ పాట మ్యూజిక్‌ లవర్స్‌ మంచి వినోదం పంచుతుందని తెలుస్తోంది. తాజాగా రాధేశ్యామ్‌ సినిమాకి హిందీలో మ్యూజిక్‌ అందిస్తున్న వారిలో ఒకరైన మనన్‌ భరద్వాజ్‌ తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ చేశాడు. తమ హానెస్ట్‌ అటెంప్ట్‌ రాధేశ్యామ్‌ మ్యూజిక్‌ని ప్రజెంట్‌ సమయం వచ్చిందని.. ఇది మీరందరూ తొరగా వినాలి అంటూ పోస్టు చేశాడు. దీంతో ప్రభాస్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Next Story