'ప్రభాస్ - మారుతి' సినిమా రిలీజ్ అప్పుడే..!

Prabhas, Maruthi Movie Release Update. నేషనల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతితో ఒక పాన్ ఇండియా సినిమా

By Sumanth Varma k  Published on  16 Jan 2023 3:20 PM IST
ప్రభాస్ - మారుతి సినిమా రిలీజ్ అప్పుడే..!

నేషనల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతితో ఒక పాన్ ఇండియా సినిమా (వర్కింగ్ టైటిల్ రాజా డీలక్స్) చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2023 దసరా కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమా మూడో షెడ్యూల్ కూడా ఈ నెల 27 నుంచి స్టార్ట్ కాబోతుంది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పై యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సీక్వెన్స్ లో హీరోయిన్ మాళవిక మోహనన్‌ కూడా పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారు.

మాళవిక మోహనన్‌ తో పాటు నిధి అగర్వాల్ కూడా హీరోయిన్ గా నటించనుంది. మూడో హీరోయిన్ గా అనుష్క శెట్టి పేరు వినిపిస్తోంది. ఇక ఈ మూడో షెడ్యూల్ కోసం ఒక థియేటర్ సెట్ ను వేశారు. ఈ సెట్ కోసం చిత్ర యూనిట్ 10 కోట్ల వరకు ఖర్చు చేశారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ సినిమా షూటింగ్ నిశ్శబ్దంగా, వేగంగా సాగిపోతుంది. ఈ హారర్ కామెడీ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయి. దీనికితోడు మారుతి రాసుకున్న కథలో ప్రభాస్ తాతగా సంజయ్ దత్ కనిపించబోతున్నాడు.

అలాగే ప్రభాస్ ది డబుల్ రోల్. ప్రభాస్ కి డబుల్ రోల్ కొత్త కాదు, కానీ తాత మనవళ్ల కథలో నటించడం మాత్రం పూర్తిగా కొత్తే. పైగా ప్రభాస్ తండ్రి గెటప్ కూడా సహజత్వానికి దగ్గరగా ఉంటుందట. కానీ దర్శకుడు మారుతీ, సిల్లీ పాయింట్లు చుట్టూ కథలు అల్లుకుంటాడు. అదే ఇక్కడ మెయిన్ సమస్య. మరి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై తీస్తున్న ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ ను ఇస్తోందో చూడాలి.


Next Story