థియేటర్లో సినిమా చూడండంటూ ఆహ్వానించిన ప్రభాస్!

Prabhas Invite Public to Watch Movies In Theatre. కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల సినిమా షూటింగ్ లతో సహా, థియేటర్లు కూడా

By Medi Samrat  Published on  25 Dec 2020 4:47 AM GMT
థియేటర్లో సినిమా చూడండంటూ ఆహ్వానించిన ప్రభాస్!

కరోనా మహమ్మారి వ్యాపించడం వల్ల సినిమా షూటింగ్ లతో సహా, థియేటర్లు కూడా మూతపడ్డాయి. అయితే ప్రభుత్వ అనుమతులతో లాక్ డౌన్ అనంతరం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ చిత్ర నిర్మాణాలను చేసుకోవడానికి అనుమతి లభించింది. ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని ఓటిటి ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదలయ్యాయి. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్ లకు అనుమతి లభించినప్పటికీ, ప్రేక్షకులు థియేటర్లో సినిమా చూడటానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లను దర్శక నిర్మాతలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రేక్షకులు థియేటర్లలోనే సినిమా చూడాలంటూ టాలీవుడ్ ప్రముఖ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

బాహుబలి చిత్రం ద్వారా ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటానికి ముందుకు రావాలని, థియేటర్లకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సినిమాలు మరి మీ ముందుకు రానున్నాయని, వాటిని థియేటర్లలోనే చూసి మంచి సినిమా చూశామని సంతృప్తినీ మీకు కలుగు చేస్తామని ప్రభాస్ తన ఇన్‌స్టా ద్వారా తెలియజేశారు.

ప్రస్తుతం ప్రభాస్ చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డేతో కలిసి రాధాకృష్ణ దర్శకత్వంలో "రాధేశ్యామ్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తవగానే జనవరిలో కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా "సలార్"చిత్రంలో నటించనున్నారు. అయితే "సలార్"చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఓం రౌత్ దర్శకత్వంలో "ఆది పురుష్‌"తో పాటు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేయనున్నారు.మొత్తానికి ప్రభాస్ చేతి నిండా సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారని తెలుస్తోంది.


Next Story