ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్ర‌భాస్ కోటి రూపాయ‌ల విరాళం

Prabhas donating 1 crore rupees andhrapradesh cm relief fund. బహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్‌ ఇండియా సినిమాలే.

By అంజి  Published on  7 Dec 2021 7:02 AM GMT
ఏపీ వరదలు.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ప్ర‌భాస్ కోటి రూపాయ‌ల విరాళం

బహుబలి సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్‌ చేస్తున్న అన్ని సినిమాలు కూడా పాన్‌ ఇండియా సినిమాలే. పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ప్రభాస్‌ బిజీ హీరో అయ్యాడు. బడా ప్రాజెక్టులతో ప్రభాస్‌ అభిమానులను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. నాలుగు సినిమాలకుపైగా ప్రాజెక్టులు ఇప్పుడు ఆయన చేతిలో ఉన్నాయి. ఇక ఈ సినిమాలన్నీ కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్‌ సైతం ఈ సినిమాల కోసం భారీగా రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నారని టాక్‌ వినబడుతోంది. ఏ ఆపద వచ్చినా తానున్నానని ప్రభాస్‌ భరోసా కల్పించిన సందర్భాలు చాలనే ఉన్నాయి. కొవిడ్‌ టైమ్‌లో 50 లక్షల రూపాయల చొప్పున తెలుగు రాష్ట్రాలకు, ప్రధాన మంత్రి రిలీఫ్‌ ఫండ్‌కి రూ.3 కోట్లు విరాళం అందించారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కోటి రూపాయల విరాళం అందించబోతున్నాడు ప్రభాస్. కోటి రూపాయల చెక్‌ని త్వరలోనే సీఎం కార్యాలయానికి పంపించనున్నాడు. మరోసారి పెద్దమనసు చాటుకున్న రెబల్‌ స్టార్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఏపీలో కురిసిన భారీ వర్షాల వల్ల భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులు కాగా.. జన జీవనం అస్థవ్యస్థంగా మారింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది.


Next Story
Share it