ప్రభాస్ - హృతిక్ కాంబో.. ఇక బాక్స్ ఆఫీస్ బద్దలవడం ఖాయం

Prabhas and Hrithik for a multi-starrer. ప్రభాస్-హృతిక్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీయాలని ఆదిత్య చోప్రా నిర్ణయించుకున్నాడని..

By Medi Samrat  Published on  9 March 2021 3:06 PM GMT
Prabhas and Hrithik for a multi-starrer
తెరపై కొన్ని కాంబినేషన్లు చూస్తే అభిమానులు పూనకంతో ఊగిపోతుంటారు. ఇక ఆ కాంబినేషన్ తమకు ఇష్టమైన స్టార్ హీరోలకు సంబంధించినది అయితే.. ఇక థియేటర్లు షేక్ కావాల్సిందే. ఈశ్వర్ తో వెండి తెరకు పరిచయం అయిన ప్రభాస్ 'బాహుబాలి' సీరీస్ తర్వాత జాతీయ స్థాయి నటుడిగా మారారు.ఇప్పుడు బాలీవుడ్ లో సైతం ప్రభాస్ కి మంచి క్రేజ్ ఉంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.


ఈ నేపథ్యంలో ప్రభాస్ కి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.. అదేంటంటే...ప్రభాస్-హృతిక్ కాంబినేషన్ లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమా తీయాలని ఆదిత్య చోప్రా నిర్ణయించుకున్నాడని.. ఇప్పటికే తన బ్యానర్ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ సినిమాకి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

గతంలో హృతిక్, టైగర్ ష్రాఫ్ లతో 'వార్' అనే భారీ యాక్షన్ సినిమా తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ క్రేజీ మల్టీస్టారర్ ని డైరెక్ట్ చేస్తాడని తెలుస్తోంది. ఇక మన రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ లతో తన రేంజ్ మరింత పెంచుకోవడం గ్యారంటీ. ఇక హృతిక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటిది ఈ ముగ్గురి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అంటే రికార్డులు బద్దలవ్వడం ఖాయం.ఈ కాంబో కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.


Next Story