రేవ్ పార్టీ వివాదం తర్వాత.. హేమ ఏ వీడియో పోస్టు చేశారో తెలుసా?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే

By Medi Samrat  Published on  22 May 2024 8:35 AM IST
రేవ్ పార్టీ వివాదం తర్వాత.. హేమ ఏ వీడియో పోస్టు చేశారో తెలుసా?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారంటూ కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ నటి హేమ పేరు వినిపించింది. అయితే హేమ తాను అక్కడికి వెళ్లలేదని ఓ వీడియోను రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. అయితే బెంగళూరు పోలీసులు మాత్రం హేమ పాల్గొన్నారని అంటున్నారు. బెంగళూరు పోలీసులు పార్టీలో హేమ ఫోటోను విడుదల చేశారు, ఫోటో, వీడియో రెండింటిలో హేమ ఒకే దుస్తులు ధరించినట్లు చూపించారు. ఏది నిజమో విచారణలో తెలుస్తుంది.

పోలీసులు ఆమె ఫోటోను విడుదల చేయడంతో, ఆమె విస్తృతమైన ట్రోలింగ్‌కు గురి అయింది. మరో ఫామ్‌హౌస్‌లో కూల్‌ అవుతున్నట్లు వీడియో తీసి మోసం చేసేందుకు ప్రయత్నించారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే మే 21న ఆమె బిర్యానీ ఎలా తయారు చేయాలో చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త వీడియోను షేర్ చేసింది. బిర్యానీ సిద్ధం చేసి పూర్తి వీడియోను అప్‌లోడ్ చేశారు. దీనికి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ ఉన్నారు.

Next Story