అలా చేస్తే ఆస్కార్ కూడా గెలుస్తాడు.. అల్లు అర్జున్‌పై పోసాని కామెంట్స్‌

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంపై

By Medi Samrat  Published on  26 Aug 2023 4:57 PM IST
అలా చేస్తే ఆస్కార్ కూడా గెలుస్తాడు.. అల్లు అర్జున్‌పై పోసాని కామెంట్స్‌

అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం దక్కడంపై ప్రముఖ నటుడు, రచయిత, ఏపీ ఎఫ్ డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది.

అల్లు అర్జున్ కు జాతీయ అవార్డు రావడం తనకెంతో సంతోషం కలిగించిందని అన్నారు పోసాని. ఇంతవరకు ఏ తెలుగు నటుడు సాధించలేనిది అల్లు అర్జున్ సాధించాడని ప్రశంసించారు. అల్లు అర్జున్ ఓ స్టార్ అయినప్పటికీ, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాడని.. అల్లు అర్జున్ నిత్య విద్యార్థి అని, అదే అతడిలో ఉండే గొప్ప లక్షణం అని అన్నారు. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఇంకా ఎదుగుతాడని, కచ్చితంగా ఆస్కార్ సాధిస్తాడని అన్నారు. అల్లు అర్జున్ అంటే తనకెంతో ఇష్టమని, అలాగే, అల్లు అర్జున్ కు కూడా తానంటే ఇష్టమని పోసాని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్, కొండపొలం, ఉప్పెన, పుష్ప చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Next Story