ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పోసాని

Posani Krishna Murali Assumed Charge as AP FDC Chairman. ఆంధ్రప్రదేశ్‌ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పోసాని కృష్ణ మురళి నేడు

By Medi Samrat
Published on : 3 Feb 2023 6:43 PM IST

ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన పోసాని

పోసాని కృష్ణ మురళి నేడు ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. తాను పదవికోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, జగన్‌ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు. చచ్చే వరకు జగన్‌తోనే ఉంటాను, వైసీపీ జెండా మోస్తానని అని అన్నారు. నాగార్జున యూనివర్శిటీకి వెళ్లే వరకు నాకు రాజకీయాలు తెలియవు.. గౌతం రెడ్డి ద్వారానే విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సీఎం జగన్‌ నాకు ఈ పదవి ఇస్తారని నేను రాజకీయాల్లోకి రాలేదు. నాకు 11 ఏళ్ల నుంచి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలుసు, నన్ను ఎప్పుడూ పిలుస్తుండేవారు. కానీ, నేను ఏనాడు ఆయన్ని కలవలేదని, డుమ్మా కొట్టేవాడినన్నారు.

చాలా మంది నాయకులు కులాల్లో నుంచి, మతాల్లో నుంచి, డబ్బుల్లో నుంచి పుడతారు. జగన్మోహన్‌రెడ్డి జనాల్లో నుండి పుట్టిన నాయకుడిని అని అన్నారు. అందుకే ఆయన అంటే నాకు ఇష్టం అని అన్నారు. ఆయన వ్యక్తిత్వం చూశాను.. అందుకే ఆయనతో స్నేహం చేశానన్నారు. నేను సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు. చెడు మాత్రం చేయను, మోసాలు చేయను, అబద్దాలు చెప్పనన్నారు.


Next Story