చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పూనమ్ కౌర్ ట్వీట్

తెలుగు రాష్ట్రాలలో జరిగే పలు అంశాలపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ ఉంటారు.

By Medi Samrat  Published on  13 Sept 2023 9:17 PM IST
చంద్రబాబు నాయుడుకు మద్దతుగా పూనమ్ కౌర్ ట్వీట్

తెలుగు రాష్ట్రాలలో జరిగే పలు అంశాలపై నటి పూనమ్ కౌర్ స్పందిస్తూ ఉంటారు. తాజాగా చంద్రబాబు నాయుడు జైలు జీవితం గడుపుతూ ఉండడంపై పూనమ్ స్పందించారు.

"ప్రజా జీవితంలో చాలా కాలం సేవలు అందించిన తరువాత 73 ఏళ్లు అనేది జైలులో ఉండే వయస్సు కాదు, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో జరుగుతున్న ఏ విషయాలకు నాకు అధారిటీ కానీ సంబంధం లేదు.. అయితే చంద్ర బాబు నాయుడు సార్ ఆరోగ్యాన్ని సంబంధిత వ్యక్తులు పరిగణించాలని మానవతా దృక్పథంతో విజ్ఞప్తి చేస్తున్నాను" అని పూనమ్ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో చేనేత వస్త్రాలకు సంబంధించి పూనమ్ కౌర్ అంబాసిడర్ గా నియమించిన సంగతి తెలిసిందే.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధించి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు శ్రీ వెంకటేశ్వరస్వామి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి క్షేమంగా బయటపడ్డారని వెల్లడించారు. ఇప్పుడు కూడా ఆ స్వామి వారే చంద్రబాబును కాపాడతారని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి వారి ఆశీస్సులతో చంద్రబాబు ఎలాంటి అవినీతి మచ్చ లేకంఉడా జైలు నుంచి తప్పకుండా బయటపడతారని అన్నారు.

Next Story