బుట్టబొమ్మతో భారీ డీల్
పూజా హెగ్డే ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డీజేతో పాపులారిటీని అందుకుంది.
By Medi Samrat Published on 25 Dec 2023 8:15 PM ISTపూజా హెగ్డే ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత డీజేతో పాపులారిటీని అందుకుంది. అరవింద సమేత, మహర్షి, అల వైకుంఠపురములో వంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు అమ్మడు ఓటీటీలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక చిత్రం, ఒక వెబ్ సిరీస్‌లో నటించనుంది. OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ లో లస్ట్ స్టోరీస్ ఆంథాలజీ ఫ్రాంచైజీ ఉంది. లస్ట్ స్టోరీస్ మూడవ సీజన్‌లో పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో ఒక ఎపిసోడ్ ఉండబోతోందని ప్రచారం జరుగుతూ ఉంది. పూజా హెగ్డే నెట్‌ఫ్లిక్స్ కోసం ఒక చిత్రం, ఒక వెబ్ సిరీస్‌లో నటించబోతోందని ప్రచారం సాగుతూ ఉంది.
రెండేళ్ల క్రితం వరకు పూజా హెగ్డే టాప్ స్టార్. పూజా చేసిన సినిమాలన్నీ భారీ హిట్స్ అయ్యాయి. ఇటీవల కొన్ని సినిమాలు ఆమెవి ఫ్లాప్ అయ్యాయి. పూజా ఇప్పటి వరకూ ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు నటనతో అలరించేందుకు రెడీ అవుతుంది. ఇప్పటి వరకు చేయనటువంటి ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.