ఆ రూమర్ల గురించి నా పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు

Pooja Hegde reacts to rumour that a producer gifted her car. పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. సల్మాన్‌ ఖాన్‌తో 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్‌' చిత్రంలో నటించింది.

By M.S.R  Published on  16 April 2023 9:15 PM IST
ఆ రూమర్ల గురించి నా పేరెంట్స్ కూడా అడుగుతూ ఉంటారు

Pooja Hegde


పూజా హెగ్డే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. సల్మాన్‌ ఖాన్‌తో 'కిసీ కా భాయ్.. కిసీ కా జాన్‌' చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. టాలీవుడ్‌లో మహేశ్ బాబు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం 'కిసీకా భాయ్​ కిసీ కీ జాన్' మూవీ​ ప్రమోషన్లలో పాల్గొన్న పూజా పలు రూమర్స్‌పై స్పందించింది. ఓ నిర్మాత కాస్ట్లీ కారు గిఫ్ట్‌ ఇచ్చారన్న రూమర్స్‌పై తాజాగా స్పందించింది. అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసింది. ఆ వార్తలో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. పూజా మాట్లాడుతూ నా గురించి ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. అప్పుడప్పుడు నా పేరేంట్స్ కూడా ఇవన్నీ నిజమేనా అని అడుగుతుంటారు. నేను నటిస్తున్న ఓ సినిమా నిర్మాతలు నాకు కాస్ట్లీ కారు గిఫ్ట్ ఇచ్చారంటూ వార్తలొచ్చాయి.. ఒక వేళ నా గురించి చెడుగా ప్రచారం చేయాలనుకుంటే నాకు కారు నిజంగానే ఇవ్వండి.. అంటూ చెప్పుకొచ్చింది పూజా హెగ్డే. నా మీద వచ్చే రూమర్లను నేను చదువుతాను.. కానీ సమాధానాలు ఇస్తూ కూర్చోలేనని తెలిపింది పూజ.


Next Story