హీరోయిన్‌ పూజా హెగ్దే కాలికి గాయం.. తెగ ఫీలవుతున్న ఫ్యాన్స్‌

Pooja Hegde suffers from ligament tear.. Full details inside. సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతోంది హీరోయిన్‌ పూజాహెగ్దే. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది.

By అంజి  Published on  20 Oct 2022 7:00 PM IST
హీరోయిన్‌ పూజా హెగ్దే కాలికి గాయం.. తెగ ఫీలవుతున్న ఫ్యాన్స్‌

సినీ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతోంది హీరోయిన్‌ పూజాహెగ్దే. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తోంది. ఇటీవల కాలంలో ఈ అమ్మడు నటించిన రెండు అంతగా ఆడకపోయినా.. ఆమె జోరు మాత్రం ఆగడం లేదు. పూజా హెగ్డే ఏకకాలంలో చాలా ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లతో బిజీగా ఉంది. అయితే తాజాగా బుట్టబొమ్మకు కాలికి గాయమైంది. ఈ విషయాన్ని ఆమెను ఇన్‌స్టా వేదికగా తెలిపింది. పూజా చేసిన పోస్ట్​ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. తన పాదానికి కట్టు కట్టుకున్న ఫొటోను పోస్ట్ చేయడంతో అభిమానులు ఒకింతా ఆందోళనకు గురవుతున్నారు.

'ఓకేదేన్'​ అని ఫొటోపై పూజా రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. తమ అభిమాన హీరోయిని కాలికి గాయం కావడంతో ఫ్యాన్స్‌ తెగ ఫీల్ అవుతున్నారు. బుట్టబొమ్మ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ విపరీతంగా కామెంట్లు చేశారు. ఇంకొందరు పూజ ఐరెన్​లెగ్​కు ఏమైంది.. అయ్యో.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. నిత్యం తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే మరోవైపు గ్లామర్​ ట్రీట్​ను కూడా ఇస్తోన్న పూజా హెగ్దేకు ఇలా గాయం కావడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.


ప్రస్తుతం పూజా హెగ్దే ముంబైలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' షూటింగ్ పాల్గొంటోంది. ఈ చిత్రం 2022 చివరిలో విడుదల కానుంది. బాలీవుడ్ లైవ్‌వైర్ రణవీర్ సింగ్ సరసన 'సర్కస్', సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన 'ఎస్‌ఎస్‌ఎంబీ28', రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో పూజా హెగ్దే తదుపరి సినిమాలు చేయబోతోంది. ఆమె కోలుకునే వరకు నటీనటుల ప్రాజెక్ట్‌లు ఇప్పుడు నిలిపివేయబడినట్లు కనిపిస్తోంది.

Next Story