Pooja Hegde: మరొక స్టార్ హీరో సినిమా నుండి కూడా అవుట్? ఇంతకీ కారణం ఏంటి?

Pooja Hegde out From Pawan Kalyan's movie. గత కొన్ని రోజులుగా పూజ హెగ్డే మీద వస్తున్న కాంట్రవర్షలకు అంతులేకుండా పోతుంది.

By Bhavana Sharma  Published on  25 Jun 2023 1:10 PM GMT
Pooja Hegde: మరొక స్టార్ హీరో సినిమా నుండి కూడా అవుట్? ఇంతకీ కారణం ఏంటి?

గత కొన్ని రోజులుగా పూజ హెగ్డే మీద వస్తున్న కాంట్రవర్షలకు అంతులేకుండా పోతుంది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన కిసికా భాయ్ కిసికి జాన్ అనే సినిమాలో నటించిన ను సంపాదించింది పూజ హెగ్డే. ఆ తర్వాత ప్రస్తుతం మహేష్ బాబు సరసన త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా హీరోయిన్గా గత కొంతకాలంగా నటిస్తూ వస్తోంది పూజ. వారం రోజులుగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలోంచి ఆమెను తీసేసినట్టు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబుకు, త్రివిక్రమ్ కు పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ నచ్చాక ప్రస్తుతం మరో హీరోయిన్ కోసం చూస్తున్నారట.

మహేష్ బాబు సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా పూజ హీరోయిన్గా ఉంచబోతున్నట్టు కొద్ది రోజుల క్రితం ఇంటర్నెట్ లోని వార్తలు కోడై కూసాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పూజ పవన్ కళ్యాణ్ సరసన మొదటిసారిగా హీరోయిన్ అని అందరూ అనుకుంటూ ఉండగా, ఆ సినిమా నుండి కూడా ఆమెను తీసేసారని తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ పక్కన నటించేందుకు ఏ హీరోయిన్ అయినా కూడా మరి ఏమీ ఆలోచించకుండా యస్ చెబుతుంది. కానీ పూజ మాత్రం నాలుగు కోట్ల రూపాయల రమ్యరేషన్ అడిగిందట. అదే నాలుగు కోట్ల రూపాయలు నిర్మాణ సంస్థ నుండి వస్తున్న మరే రెండు సినిమాల్లో గనుక ఇన్వెస్ట్ చేస్తే, రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే ఇద్దరు హీరోయిన్లు రావడం మాత్రమే కాకుండా కుదిరితే ఒక ఐటమ్ సాంగ్ చేసే హీరోయిన్ కూడా వస్తుందని లెక్కలు వేసుకున్నారట. కాబట్టి అన్ని ఆలోచించుకొని, పూజకు గత కొంతకాలంగా చెట్లు కూడా లేకపోవడంతో ఈ సినిమా నుండి కూడా అరకు టాటా చెప్పేసారట.

అది మాత్రమే కాకుండా డైరెక్టర్ పరశురాం మరియు విజయ దేవరకొండ కలిసి చేయబోతున్న సినిమాలో కూడా ముందుగా పూజనే హీరోయిన్గా అనుకున్నారు. కానీ ప్రస్తుతం అందులో అధికారికంగా మృనాల్ ఠాకూర్ హీరోయిన్ అని ప్రకటించారు. కాబట్టి ప్రస్తుతం పూజా హెగ్డే కు మరొక తెలుగు సినిమా లేనట్టే.


Next Story