పూజ హెగ్డే కుటుంబంలో విషాదం

Pooja Hegde Grandmother Passed Away. టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న పూజ హెగ్డే కుటుంబంలో విషాదం.

By Medi Samrat  Published on  28 Feb 2021 3:05 PM GMT
Pooja Hegde

టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న పూజ హెగ్డే కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. పూజ హెగ్డే బామ్మ మృతి చెందింది. ఈ నేప‌థ్యంలో ఆమెను గుర్తు చేసుకుంటూ పూజ హెగ్డే భావోద్వేగ‌భ‌రితంగా ట్వీట్ చేసింది. బామ్మ‌ను కోల్పోయామ‌ని, ఆమె ఎక్క‌డ ఉన్నా సంతోషంగా, ఎలాంటి బాధ‌లు లేకుండా ఉండాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు చెప్పింది. ఎన్ని క‌ష్టాలు ఎదురైనా న‌వ్వుతూ ఉండాలనే విష‌యాన్ని త‌న బామ్మ త‌మ‌కు నేర్పించిందని పూజ హెగ్డే పేర్కొంది.

ధైర్యంగా ఉండ‌డాన్ని, ఇగోను ప‌క్క‌న‌బెట్టి కావాల్సిన వారితో క‌లిసిమెల‌సి ఉండడాన్ని త‌న బామ్మ నేర్పించింద‌ని తెలిపింది. ఆమె ఎప్పుడు త‌నతోనే ఉంటుందని, ల‌వ్ యూ ఆజీ అని చెప్పుకొచ్చింది. తాను సినిమా షూటింగుల్లో ఉన్న‌ స‌మ‌యంలో త‌న‌కు ఫోన్ చేసి ఎలా ఉన్నావ‌ని అడిగేద‌ని చెప్పింది. ఇప్పుడు తాను ఆమె ఫోన్ కాల్స్ ను మిస్ అవుతున్న‌ట్లు తెలిపింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు తెలుపుతూ త‌న బామ్మ‌తో గ‌తంలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది.

2021 ఇయర్ లో పూజా హెగ్డే నటిస్తోన్న మూడు తెలుగు చిత్రాలు విడుదల కానున్నాయి. అందులో 'ఆచార్య' ముందుగా థియేటర్స్‌లోకి రానుంది. ఈ సినిమాలో పూజా హెగ్డే 20 నిమిషాలు మాత్రమే కనిపించనుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధే శ్యామ్ సినిమాల మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సల్మాన్ ఖాన్ తో కూడా బాలీవుడ్ లో ఓ ప్రాజెక్టుకు ఓకె చెప్పింది బుట్టబొమ్మ.


Next Story
Share it