'సానా కష్టం వచ్చిందే' సాంగ్‌పై.. ఆర్‌ఎంపీల అభ్యంతరం

Police complaint against Acharya movie song. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘ఆచార్య’ వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమా నుండి ఇటీవల విడుదలైన ‘‘సానా కష్టం వచ్చిందే

By అంజి  Published on  6 Jan 2022 9:59 AM GMT
సానా కష్టం వచ్చిందే సాంగ్‌పై.. ఆర్‌ఎంపీల అభ్యంతరం

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఆచార్య' వివాదంలో చిక్కుకుంది. ఆ సినిమా నుండి ఇటీవల విడుదలైన ''సానా కష్టం వచ్చిందే మందాకినీ'' లిరికల్‌ సాంగ్‌పై ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. వైద్య వృత్తిని కించపరిచే విదంగా "ఏడేడో నిమరొచ్చని కుర్రాల్లే ఆర్ఎంపి లు అవుతున్నారే.." అనే పాటలోని వ్యాఖ్య తమ వృత్తిని కించపర్చుతున్నాయని ఆరోఎంపీ సంఘం ఆరోపించింది. తక్షణమే ఆ పాటను మార్చకుంటే 'ఆచార్య' సినిమా నిర్మాతపై కేసుపెడతామని.. 'తెలంగాణ ఆర్‌ఎంపీల రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు పసునూరి సత్యనారాయణ డిమాండ్ చేశారు.

జనగామ జిల్లా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసు అధికారులను కలిసి మెమోరండం అందజేశారు. అలాగే కోర్టు అడ్వకేట్ కలిసి న్యాయ సలహాలు కొరకు వారి సంప్రదించారు. న్యూఇయర్‌ సందర్భంగా 'ఆచార్య' సినిమాలోని ''సానా కష్టం వచ్చిందే మందాకినీ'' లిరికల్‌ పాటను విడుదల చేసింది. ఈ ఐటం సాంగ్‌లో హీరోయిన్‌ రెజీనా కసెండ్రా తన స్టెప్పులతో అందరిని మెప్పించింది. ఈ పాట ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆచార్య సినిమాలో మెగస్టార్‌ చిరంజీవి, ఆయన కుమారుడు రామ్‌చరణ నటిస్తున్నారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.


Next Story
Share it