హైదరాబాద్‌లోని SR నగర్ పోలీస్ స్టేషన్‌లో నటుడు విజయ్ దేవరకొండపై ఫిర్యాదు దాఖలైంది. స్థానిక న్యాయవాది లాల్ చౌహాన్ దాఖలు చేసిన ఈ వ్యాజ్యంలో, ఇటీవల జరిగిన ఓ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ గిరిజన వర్గాల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు.
నటుడు సూర్యతో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ, కశ్మీర్‌లో ఇటీవల జరిగిన పహల్గామ్ సంఘటనకు, శతాబ్దాల నాటి గిరిజన యుద్ధాలకు మధ్య సారూప్యతలను చూపించారని చౌహాన్ ఆరోపించారు. ఈ సారూప్యత అగౌరవంగా ఉందని, స్థానిక తెగలను చెడుగా చిత్రీకరించిందన్నారు. ఈ వ్యాఖ్యాకపై విజయ్ దేవరకొండ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అనేక గిరిజన సంస్థలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. SR నగర్‌లోని పోలీసు అధికారులు ఫిర్యాదును స్వీకరించారని, తదుపరి చర్యలను తీసుకోడానికి విశ్లేషిస్తున్నారని చౌహాన్ తెలిపారు. ఇప్పటివరకు, విజయ్ దేవరకొండ ఈ అంశంపై బహిరంగ ప్రకటన విడుదల చేయలేదు.