చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 200కి పైగా సినిమా పాటలు పాడిన గాయని సంగీత సజిత్ ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురంలో కన్నుమూశారు. సంగీత సజిత్ వయస్సు ప్రస్తుతం 46 సంవత్సరాలు. సంగీత గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతోంది. తిరువనంతపురంలోని తన సోదరి నివాసంలో ఆమె మరణించారు. సంగీత వివిధ దక్షిణ భారత భాషల్లో 200 పాటలు పాడారు.
సంగీత కెరీర్ ప్రారంభంలో మిస్టర్ రోమియో చిత్రంలో AR రెహమాన్ స్వరపరచిన "తన్నెరై కదలిక్కుం" పాట సూపర్‌హిట్ అయింది. పృథ్వీరాజ్ నటించిన 'కురుతి' చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్ ఆమె చివరి పాట. ఆదివారం సాయంత్రం తిరువనంతపురంలోని థైకాడ్‌లోని శాంతికవాదం పబ్లిక్ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. సంగీత మరణ వార్త తెలుసుకున్న సౌత్ సినిమాకు చెందిన పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలియజేశారు.