ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైన పెళ్లిసందD

Pelli Sandadi Movie OTT Release Date. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'పెళ్లిసందడి' చిన్న సినిమాల్లో

By Medi Samrat  Published on  22 Jun 2022 11:15 AM GMT
ఎట్టకేలకు ఓటీటీ విడుదలకు సిద్ధమైన పెళ్లిసందD

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు తెరకెక్కించిన 'పెళ్లిసందడి' చిన్న సినిమాల్లో భారీ హిట్ గా అప్పట్లో నిలిచింది. శ్రీకాంత్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అభిమానులకు అప్పట్లో బాగా కనెక్ట్ అయింది. సాంగ్స్ కూడా సెన్సేషనల్ హిట్ గా నిలిచాయి. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించగా, యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్‌గా నటించిన పెళ్లిసందD కూడా థియేటర్లలో మంచి కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ వహించారు.

అప్పట్లో ఈ సినిమాతో పాటూ విడుదలైన చాలా సినిమాలు ఓటీటీలోకి వచ్చేయగా.. ఈ సినిమా మాత్రం ఓటీటీ రిలీజ్ ను చాలా ఆలస్యం చేసింది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం జీ5లో జూన్ 24న విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు కూడా ఓ ముఖ్య పాత్రలో నటించడం విశేషం. కాగా ఈ సినిమాను గౌరీ రొణంకి తెరకెక్కించగా, ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె. ఫిలిం అసోసియేట్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేశాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు.


Next Story
Share it