పెళ్లి సందడి హీరోయిన్.. నా కూతురు అని చెప్పొద్దంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త

Pelli Sandadi heroine Sree leela in controversy. పెళ్లి సందడి సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్

By అంజి  Published on  17 Oct 2021 10:38 AM GMT
పెళ్లి సందడి హీరోయిన్.. నా కూతురు అని చెప్పొద్దంటున్న ప్రముఖ పారిశ్రామిక వేత్త

పెళ్లి సందడి సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా నటించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో డైరెక్టర్ గౌరీ రోనంకీ తెరకెక్కించిన చిత్రం పెళ్లి సందD. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల మంచి నటనను ప్రదర్శించింది. గ్లామర్ తో కూడా మెప్పించింది. అయితే ఓ వివాదం ఇప్పుడు ఆమెను చుట్టుముట్టింది.

శ్రీలీల నా కూతురు కాదంటూ సూరపనేని శుభాకర రావు చెప్పుకొచ్చారు. శ్రీలీల తన కూతురంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. సూరపనేని ఫౌండేషన్ పేరుతో ఇన్విటేషన్ కార్డ్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సూరపనేని శుభాకర రావు తెలిపారు. శ్రీలీల తన మాజీ భార్య కూతురని తాము విడిపోయిన తరువాత శ్రీలీలకు తన మాజీ భార్య జన్మనిచ్చిందని తెలిపారు. తన ఆస్తులపై క్లైమ్ చేయడానికి తన పేరు వాడుతున్నారని ఈ విషయంపై న్యాయపరంగా ముందుకెళతామని హెచ్చరించారు. ఇంకా తమ విడాకులపై కేసులు నడుస్తున్నాయని.. తమ విడాకుల కేసులో హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్లినట్లుగా సూరపనేని శుభాకరరావు తెలిపారు.

'శ్రీలీల నా కూతరు కాదు. ఆమె నా మాజీ భార్య కూతురు. మేము విడిపోయిన తర్వాత నా మాజీ భార్య శ్రీలీలకు జన్మనిచ్చింది. నా ఆస్తులను క్లెయిమ్‌ చేయడానికి ఇంటర్వ్యూలలో నా పేరు వాడుతున్నారు.ఈ విషయంలో న్యాయపరంగా ముందుకెళ్తాము. ఇంకా మా విడాకులపై కేసులు నడుస్తున్నాయి. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లాము. దీనిపై సూరపనేని సొసైటీకి కూడా ఫిర్యాదు చేసినట్లు' అంటూ వ్యాపారవేత్త సూరపనేని శుభాకరరావు తన స్టేట్మెంట్ ను విడుదల చేశారు.

Next Story