కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’.

By -  Medi Samrat
Published on : 30 Sept 2025 4:36 PM IST

కాంతార: చాప్టర్1 వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందన

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ ‘కాంతార:చాప్టర్1’. ఈ చిత్రం ఘన విజయం సాధించిన ‘కాంతార’కు ప్రీక్వెల్‌గా రాబోతోంది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

దీనిపై వస్తున్న విమర్శలపై పవన్ కల్యాణ్ స్పందించారు. సినిమా అనేది భిన్నమైన కళల సమాహారం. అందుకే డబ్బింగ్ చిత్రం పేరుతో ఇతర మూవీస్‌ను మనం వేరుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కాలం నుంచి ఇప్పుడున్న హీరోలు కిచ్చా సుదీప్, రిషబ్ శెట్టి వరకూ ప్రతి నటుడుని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారని తెలిపారు. సోదర భావంతో మెలుగుతున్నామని, తెలుగు సినిమాకు వ్యాపారపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను రెండు భాషల ఫిల్మ్ ఛాంబర్స్ కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. ఆ తర్వాత ప్రభుత్వ పరంగా మనం మాట్లాడదామని తెలిపారు. కళ ప్రజలను ఏకం చేయాలి, విభజించకూడదు. రాష్ట్రాలు, భాషలు, సంస్కృతుల మధ్య అశాంతి తలెత్తినప్పుడు, మనం వాటిని దాటి ఎదగాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్. అన్ని అపోహలను పక్కనపెట్టి కాంతారా సినిమాను ఆస్వాదించాలని చెప్పుకొచ్చారు.

Next Story