రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ 'ఓజీ'

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న 'OG' సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా

By Medi Samrat
Published on : 30 Jan 2024 6:15 PM IST

రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న పవన్ కళ్యాణ్ ఓజీ

పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న 'OG' సినిమా విడుదల తేదీని కన్ఫర్మ్ చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాను.. ఈ ఏడాది సెప్టెంబర్ 27న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ OG విడుదల తేదీని లాక్ చేశారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల కారణంగా బిజీగా ఉండడంతో ఆయన నటిస్తున్న పలు సినిమాల విడుదల ఆలస్యం అవుతూ ఉన్నాయి.

సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్ప‌టికే దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తీ చేసుకుంది. ఈ ఏడాది జూన్‌ నుంచి బ్యాలెన్స్‌ పార్ట్‌ షూటింగ్ ప్రారంభం కానుంది. పవన్ కళ్యాణ్‌తో ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అతను సెట్స్‌లో చేరతానని హామీ ఇచ్చాడు. ఈ సినిమా విడుదల తేదీ సెప్టెంబర్ 27, 2024 అని.. త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు. ప్రముఖ నటీనటులు ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం థమన్ ఇస్తున్నాడు. ఇప్పటికే టీజర్ లో ఓజీ బ్యాగ్రౌండ్ స్కోర్ కు పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిదా అయిపోయారు.

Next Story