పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'OG' సినిమా అందరి అంచనాలను మించి ట్రెండ్ అవుతూనే ఉంది. USA లో ఇప్పటివరకు ప్రీ-సేల్స్‌లో 500K డాలర్లను దాటిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచి రికార్డును నెలకొల్పింది. ఇది ఆశ్చర్యకరమైన ప్రారంభం, సినిమా విడుదలకు దాదాపు ఒక నెల సమయం ఉండగానే, దే కాల్ హిమ్ OG కొత్త కొత్త సంచలనాలను సృష్టిస్తూ ఉంది.
ఓజీ సినిమా అమెరికా ప్రీ-సేల్స్ $500K మార్కును దాటడంతో పవన్ కళ్యాణ్ భారతీయ సినిమా రికార్డును నెలకొల్పడంతో అభిమానులు ఎంతో ఆనందంగా ఉన్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే టాలీవుడ్‌లో అతిపెద్ద ఓపెనింగ్స్‌లో ఒకదాన్ని సాధించే అవకాశం ఓజీ సినిమాకు ఉంది.