హీరోలందరూ రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడంతో పాటు పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తూ ఫిజిక్ ని కాపాడుకుంటూ ఉంటారు. అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా జిమ్ చేస్తూ వచ్చాడు. అయితే.. రాజకీయాల్లో పవన్ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఫిజిక్ మీద కాస్త ఫోకస్ తగ్గినట్లు కనిపించింది. కేవలం ప్రజలు, ప్రజా సమస్యలు అంటూ.. తన శరీర దారుడ్యానికి ఇసుమంత కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు.
కాగా.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని డిసైడైన తర్వాత 'వకీల్ సాబ్' కోసం లుక్ లో కాస్త వేరియేషన్ చూపించాడు. ఈ క్రమంలో సన్నగా మారడం కోసం ఇప్పుడు పవన్ కేవలం ద్రవ పదార్ధాలను మాత్రమే తీసుకుంటూ డైట్ మెయింటైన్ చేస్తున్నాడట. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రాన్ని బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది బాలీవుడ్ 'పింక్' చిత్రానికి రీమేక్ అయినప్పటికీ తెలుగులో పవర్ స్టార్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని పలు మార్పులు చేశారు. మెగా డాటర్ నిహారిక వివాహం కోసం షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన పవన్.. నిహారికా పెళ్లి తరువాత సినిమా చివరి షెడ్యూల్‌ను పూర్తి చేయనున్నాడు.